అశ్వథామ కి సమంత సపోర్ట్.

అశ్వథామ కి సమంత సపోర్ట్.

Published on Feb 1, 2020 4:47 PM IST

టాలీవుడ్ క్వీన్ సమంత అక్కినేని అశ్వథామ హీరోకి శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా స్వీటెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ హీరో నాగ శౌర్య కి అశ్వథామ చిత్రం విజయం సాధించినందుకు అభినందలు అని, తెలిపారు. అలాగే హీరో నాగ శౌర్య తో ఆమె దిగిన ఫోటో షేర్ చేసుకున్నారు. సమంత అశ్వథామ చిత్రానికి ఈ రూపంలో ప్రచారం కల్పించడం ఆ సినిమాకు కలిసొచ్చే అంశం. గత ఏడాది సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచిన ఓ బేబీ సినిమా లో నాగ శౌర్య..సమంత ను ప్రేమించే కుర్రాడిగా నటించారు.

ఇక నిన్న విడుదలైన అశ్వథామ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు రమణ తేజ ఆకట్టుకొనే అంశాలతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. నాగ శౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రం నిర్మించారు. ఇక మెహ్రిన్ హీరోయిన్ గా నటించగా శ్రీచరణ్ పాకాల సాంగ్స్ అందించారు.

తాజా వార్తలు