ప్రేక్షకులతో కలిసి సినిమా చుసిన సమంతా

ప్రేక్షకులతో కలిసి సినిమా చుసిన సమంతా

Published on Jul 11, 2012 10:40 AM IST


సమంతా ఇప్పటి వరకు తెలుగులో నటించిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ఆమె తమిళ్ నటించిన సినిమాలు మాత్రం ఒక్కటి కూడా హిట్ కాలేదు. ఇటీవలే రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈగ చిత్రం తమిళ్లో ‘నాన్ ఈ’ పేరుతో విడుదలైంది. తెలుగుతో పాటుగా తమిళ్లో కూడా ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటుంది. తమిళ్లో మొదటి హిట్ ఆనందాన్ని పంచుకునేందుకు ఆమె నాన్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల మధ్య కుర్చుని చూసారు. ఈ సినిమాలో ఆమె నటనకు, హావ భావాలకు అందరు ప్రశంసల జల్లు కురిపిస్తుండటంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇటీవల పలు ఆరోగ్య సమస్యలు ఏర్పడటంతో కొత్త సినిమాలు ఒప్పుకొని సమంతా మరో మూడు సంవత్సరాల తరువాత రిటైర్ అవుతాను చెప్పడం భాధాకరం. ఆమె నటించిన ఎటో వెళ్ళిపోయింది మనసు త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా, దూకుడు తరువాత మహేష్ బాబు సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మరోసారి నటిస్తుంది. ఇవే కాకుండా రామ్ చరణ్ సరసన ఎవడు, సిద్ధార్థ్ సరసన నందిని డైరెక్షన్లో మరో సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

తాజా వార్తలు