‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో అటు ఫ్యామిలీ ప్రేక్షకులకు, ఇటు కుటుంబ కధా చిత్రాలకు దగ్గరయిన మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా విడుదలై చాలా రోజులవుతున్నప్పటికీ రామ్ చరణ్ ఇంకా తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. కానీ తన తదుపరి సినిమా శ్రీను వైట్లతో ఉంటుందని ఇది వరకే తెలియజేశాం. ఈ సినిమా జనవరి 28 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. మరో రెండు వారాల్లో ఈ సినిమా లాంచనంగా ప్రారంభం కానుంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఎవరు నటిస్తారా అనే విషయంలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని మీకందిస్తున్నాం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత జోడీ కట్టనుంది. రామ్ చరణ్ – సమంత జోడీ కట్టడం మొదటిసారి కావడంతో ఈ కాంబినేషన్ చూడటానికి చాలా బాగుంటుందని అందరూ అంటున్నారు. డివివి దానయ్య నిర్మించనున్న ఈ సినిమాలో నటించే మిగిలిన తారలను, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలుపనున్నారు. ఈ సినిమానే కాక చరణ్ గౌతం మీనన్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ కు పచ్చ జెండా ఊపినట్టు సమాచారం.