ఆ హీరోయిన్ ఏది పట్టుకున్నా బంగారమే


సౌత్ ఇండియన్ అందాల భామ సమంత ‘ఈగ’ చిత్రంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గోల్డెన్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్నారు. ‘ఈగ’ చిత్రం కంటే ముందు కూడా తను నటించిన ‘ఏ మాయ చేసావే’, ‘బృందావనం’ మరియు ‘దూకుడు’ చిత్రాలు కూడా విజయం సాదించాయి కానీ ‘ఈగ’ సినిమా విజయంతో సినీ ఇండస్ట్రీ అంతా సమంత గోల్డెన్ లెగ్ అనే సెంటిమెంట్ ని బాగా నమ్ముతున్నారు. ఇలా ఒక కథానాయిక వరుస హిట్లు సాదించడం అనేది మామూలు విషయం కాదు కానీ సమంత అలాంటి అరుదైన రికార్డును సాదించారు. ఈ సంవత్సరం సమంత నటించిన భారీ చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి.

ప్రస్తుతం సమంత “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”,” ఎటో వెళ్ళిపోయింది మనసు”, “ఎవడు”, “ఆటోనగర్ సూర్య” మరియు నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాల్లో నటిస్తున్నారు. అందాల భామ సమంత ఈ సంవత్సరం మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశిద్దాం.

Exit mobile version