రీసెంట్ గా మన తెలుగు ఆడియెన్స్ ను అలరించిన క్లీన్ హిట్ చిత్రాల్లో స్టార్ హీరోయిన్ సమంత కేమియో పాత్రలో తను నిర్మాతగా చేసిన సినిమా శుభం కూడా ఒకటి. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన ఈ సినిమాలో యువ నటీనటులు హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపుడి లు నటించిన ఈ సినిమా థియేటర్స్ లో మహిళలని మరింత అలరించింది.
ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులు జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే అందులో నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ సినిమాని అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు డెఫినెట్ గా చూడవచ్చు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి