పిల్లలకి క్రిస్మస్ ఆనందాన్ని పంచిన సమంత

Samantha
అందాల భామ సమంత కొంతమంది అనాధ పిల్లలకు తన స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా క్రిస్మస్ పార్టీ ఇచ్చింది. ఈ ఈవెంట్ కి కావాల్సిన మొత్తాన్ని సమంత ఇవ్వగా, తన అభిమానులు ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసారు.

సమంత అభిమానులు ఆ పిల్లలకు స్వీట్స్, కొన్ని వస్తువులను పంచి పెట్టి వాళ్ళని క్రిస్మస్ రోజు సంతోషపరిచారు. ప్రస్తుతం షూటింగ్ లో బాగా బిజీగా ఉండటం వల్ల సమంత ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ప్రస్తుతం సమంత ఎన్.టి.ఆర్ – సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. అలాగే వివి వినాయక్ డైరెక్షన్ లో బెల్లంకొండ సురేష్ కొడుకు హీరోగా పరిచయమవుతున్న సినిమాలో కూడా నటిస్తోంది.

Exit mobile version