సమంతకు ఈ యేడాది చాలా ప్రత్యేకంగా నిలవనుంది. సూర్య సరసన లింగుస్వామి దర్శకత్వంలో అంజాన్ లో మెరుస్తుంటే ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ తో జతకట్టనుందని సమాచారం. గత యేడాది ఈ భామ విజయ్‌తో నటించనుంది అని చాలా పుకార్లు వచ్చినా ఇది ఇప్పటికీ నిజమైయింది
కలకత్తా కాళీ ఘాట్ గుడిలో ఈ కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. గతంలో విజయ్, మురుగదాస్ కలయికలో వచ్చిన తుపాకి సినిమా ఘనవిజయం సాధించింది. అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నాడు. జార్జ్ సీ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్. లీసా ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుంది
ఇప్పటికే ఆటోనగర్ సూర్య, రభస, మనం సినిమాలతో తెలుగు తెరపై నిండిన ఈ భామ త్వరలో త్రివిక్రమ్ తీయనున్న సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించనుందని సమాచారం