దేన్నైనా కష్టపడి సాధించాలేగానీ సులభంగా వస్తే దాని వలన కలిగే సంతృప్తి మనకు వుండదని అందాల భామ సమంత వెల్లడించండి. సులభంగా పైకి రావడం అన్నది సినిమాలలోనే జరుగుతుంది. నిజ జీవితంలో కష్టపడనిదే ఏది రాదని, విజేతల జీవితగాధలే దీనికి ఆదర్శప్రాయమని సమంత వెల్లడించింది.
ఒక హిట్ సినిమా తీయాలంటే ఎంతో కష్టమని, ఎన్నో వందల మంది తెరవెనుక అహర్నిసలు కష్టపడితే వచ్చే అవుట్ పుట్ నే ప్రేక్షకులు ఆదరిస్తారని, శ్రమ లేకుండా వచ్చే విజయం లో కిక్ వుండదని ఈ భామ పేర్కుంది. అంతేకాక తన ప్రతీ సినిమాకీ తాను ఒకే విధంగా కష్టపడతానని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీ సినిమాలో నటుస్తున్న ఈ నాయిక కొత్తసంవత్సరం ఇలా కొత్త మాటలతో మొదలుపెట్టిందన్నమాట