ఎనర్జిటిక్ హీరో రామ్ తను చేసిన ‘మసాలా’ సినిమా ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో తన తదుపరి సినిమాలను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చాలా గ్యాప్ తీసుకున్న రామ్ ఇటీవలే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పండగ చేస్కో’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రామ్ తాజాగా మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నటుడిగా పలు సినిమాల్లో నటించిన మల్లిడి వేణు ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవ్వనున్నాడని సమాచారం. అలాగే ఈ సినిమాలో రామ్ సరసన టాలీవుడ్ టాప్ హీరోయిన్ అందాల భామ సమంత జోడీ కట్టనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాకి ‘ఆకతాయి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.