‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ టీంతో కలిసిన సమంత

‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ టీంతో కలిసిన సమంత

Published on Aug 22, 2012 10:33 PM IST


చాలా రోజులుగా అనారోగ్యం వల్ల షూటింగ్ లకు దూరంగా ఉన్న సమంత గత కొన్ని రోజులుగా చిత్రేకరణలో పాల్గొంటోంది. ప్రస్తుతం సమంత గౌతం మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర చివరి షెడ్యూల్ చెన్నై సమీపంలోని కల్పాకం లో జరుగుతోంది. ఈ చిత్ర తెలుగు వర్షన్ లో నాని హీరోగా నటిస్తున్నారు మరియు తమిళ వర్షన్ లో జీవా హీరోగా నటిస్తున్నారు. తమిళంలో ‘నీతానే ఎన్ పొన్ వసంతం’ అనేది టైటిల్. చాలా కాలం క్రితం ప్రారంభమైన ఈ చిత్ర చిత్రీకరణ చివరి దశలో ఉన్న సమయంలో సమంత అనారోగ్యం పాలవడంతో ఈ చిత్ర చిత్రీకరణ ఆగిపోయింది. సమంత రెండు నెలల విరామం తర్వాత ఇటీవలే నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్ర చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ రోజు నుంచి సమంత ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. క్యూట్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని, సమంత విభిన్న గెటప్పులలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో హక్కులని సోనీ మ్యూజిక్ సంస్థ వారు కొనుక్కున్నారు. ఈ చిత్ర ఆడియోను సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు