విజయ్ – మురుగదాస్ మూవీ సెట్లో జాయిన్ అయిన సమంత

Samantha
ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఫుల్ బిజీ బిజీగా ఉన్న హీరోయిన్స్ లో అందాల భామ సమంత ఒకరు.. కొద్ది రోజుల క్రితమే పారగాన్ ఫుట్ వేర్ కోసం కమర్షియల్ ప్రకటన కోసం షూట్ పూర్తి చేసిన తర్వాత కాస్త సెలవుల కోసం లండన్ వెళ్ళింది. అక్కడి నుంచి వివి వినాయక్ మూవీ షూటింగ్ కోసం దుబాయ్ వెళ్ళింది.

ప్రస్తుతం సమంత దుబాయ్ షూటింగ్ పూర్తి చేసుకొని ఎఆర్ మురుగదాస్ – విజయ్ సినిమా షూటింగ్ లో పాల్గొనడం కోసం హైదరాబాద్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే కోల్ కతా లో జరిగింది. అలాగే సమంత కూడా ఈ మూవీ షూటింగ్ కోసం కొద్ది రోజులు చెన్నైలో షూటింగ్ లో పాల్గొంది.

ఈ సినిమా కాకుండా సమంత సూర్య అంజాన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. అలాగే ఎన్.టి.ఆర్ సరసన చేస్తున్న ‘రభస’, అక్కినేని మల్టీ స్టారర్ మూవీ ‘మనం’ సినిమాలు చివరి దశలో ఉన్నాయి.

Exit mobile version