దీపికా బాటలో సమంత

Samanthaand-Deepika-Padukon

టాలీవుడ్ లో సమంత, బాలీవుడ్ లో దీపికా పదుకునే అగ్రస్థానాలలొ వున్నారు. భాషలు, ఆహార్యాలూ వేరైనా వారిని దగ్గరగా గమమిస్తే చాలా పోలికలు ఉన్నాయి. అవేంటో చూద్దాం ఇద్దరూ తమ తమ ఇండస్ట్రీలలో లక్కీ హ్యాండ్ గా భావిస్తారు. వారు నటించిన సినిమాలు తప్పక విజయాలవుతాయని నమ్మకం. దీపిక నటించిన ‘చెన్నై ఎక్స్ప్రెస్స్’ బాలీవుడ్ కే టాప్ హిట్ గా నిలిస్తే, సమంత నటించిన ‘అత్తారింటికి దారేది’ తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది ఇప్పుడు వీరికి మరో పోలిక కూడా జతకలిసింది. బాలీవుడ్ పుకార్ల ప్రకారం దీపికా లక్స్ సంస్థకు కొత్త ప్రచారకర్తగా ఎంపిక అయ్యిందట. అధికారిక ప్రకటన ఒక్కటే తరువాయట. ఇప్పటికే సమంత లక్స్ కి ఆంధ్రా కు ప్రచారకర్తగా ఎంపికై సిద్ధార్థ్ తో కలిసి షూట్ లో కూడా పాల్గుంది. ఇద్దరి కెరీర్ లు ఒకలాగే నడుస్తున్నాయి కదా ఫ్రెండ్స్??

Exit mobile version