ఏమాయ చేసావే టాటూ వేయించుకున్న సమంత

Samantha
చెన్నై ముద్దుగుమ్మ త్రిష ‘నెమో’ టాటూ వేయించుకుందని అందరికీ తెలుసు, కానీ ఎంత మందికి తెలుసు అందాల భామ సమంత ఏమాయ చేసావే టాటూ గురించి?.. సమంత వీపు మీద ‘ఏమాయ చేసావే’ టైటిల్ టాటూ ఉంది. ఇటీవలే పోస్ట్ నూన్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత స్వయంగా ఈ విషయాన్ని తెలిపింది. అలాగే సమంత మాట్లాడుతూ ‘ ఏమాయ చేసావే సినిమా నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కొత్త ఇంటిని బహుమతిగా ఇచ్చింది. అందుకే ‘ఏమాయ చేసావే’ టాటూ వీపుపై వేసుకున్నాను’ చెప్పింది. ప్రస్తుతం సమంత ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version