చెన్నై ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం జబర్దస్త్ సినిమాలోని ఓ పాట షూటింగ్లో మలేషియాలోని లంగక్విలో ఉంది. సెట్స్ లో ఎలాంటి ఇబ్బంది పెట్టదు అని బాగా పేరున్న సమంత ప్రస్తుతం అక్కడున్న వాతావరణ పరిస్తితుల వల్ల సెట్స్ లో కష్ట కాలాన్ని గడుపుతోంది. కానీ తను ఏమీ చేయలేకపోవడంతో తన బాధని సోషల్ నెట్వర్కింగ్ సైట్లో తెలుపుకుంటూ ‘ లంగక్వి వాతావరణం బాగా పెనుం మీద కాల్చితే ఎలా ఉంటుందో అలా ఉంది. నా టాప్ టెన్ ప్రదేశాల్లో ఇది అస్సలు ఉండదు. ఎప్పుడెప్పుడు తిరిగి ఇంటికోచ్చేస్తానా అని చూస్తున్నానని’ తెలిపింది.
నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సిద్దార్థ్ హీరో కాగా, నిత్యా మీనన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ కాగానే సమంత ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ సినిమా మరియు జనవరి 22 నుంచి ప్రార్రంభం కానున్న పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ లో బిజీ కానుంది. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఈ భామ ఈ సంవత్సరం చేయనున్న మరికొన్ని పెద్ద సినిమాలతో అదే ఇమేజ్ ని కొనసాగించాలనుకుంటోంది.