ఎమోషనల్ అవుతున్న సమంత

ఎమోషనల్ అవుతున్న సమంత

Published on Aug 24, 2012 2:30 AM IST


తిరిగి చిత్రీకరణలో పాల్గొనడం మొదలు పెట్టాక తన సహచరులు తనకు చేస్తున్న సహాయానికి కాను సమంత కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. రెండు నెలల పాటు తన అనారోగ్య కారణాల మూలాన ఏ చిత్ర చిత్రీకరణలోను సమంత పాల్గొనలేదు చాలా మంది నిర్మాతలు ఆమెతో చిత్రీకరణ తిరిగి ప్రారంభించడానికి చాలా ఓపిగ్గా వేచి చూసారు. తను తిరిగి వచ్చాక తన వల్ల నిర్మాతలు మరియు దర్శకులు ఇబ్బంది పడ్డారని సమంత కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్టు తెలుస్తుంది. తనను ఆశ్చర్య పరిచేలా అందరు తన ఆగమనానికి చాలా సంతోషించడమే కాకుండా చాలా సపోర్టివ్ గా కూడా ఉంటున్నట్టు తెలిస్తుంది. “నా చిత్రాల నిర్మాతలు,దర్శకులు మరియు సహనటులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నేను అనుకున్నదానికన్నా ఎక్కువ సపోర్ట్ ని నాకు అందిస్తున్నారు గతంలోకన్నా ఇంకా ఎక్కువగా కష్టపడటానికి ప్రయత్నిస్తా ట్విట్టర్లో రెండు నెలల నుండి నా ఆరోగ్యం గురించి ట్వీట్ చేసిన వారికి నా కృతజ్ఞతలు” అని సమంత ట్విట్టర్లో చెప్పారు. ప్రస్తుతం సమంత చెన్నైలో జరుగుతున్న “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రీకరణలో పాల్గొంటుంది దీని తరువాత ఆమె “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రీకరణలో పాల్గొననుంది.

తాజా వార్తలు