స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడూ బిజీగానే ఉంటారు. ఒకవైపు సినిమాలు చేస్తూ ఇంకోవైపు వెబ్ సిరీస్ ట్రెండ్లో కూడ అడుగుపెట్టారు. ఈమధ్యే సాఖి పేరుతో ఆన్ లైన్ క్లోతింగ్ బిజినెస్ కూడ స్టార్ట్ చేశారు. ఇంత బిజీలో ఉన్నా కూడ ఆమె సోషల్ మీడియాలో తరచూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంటారు. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేసి ఫీలింగ్ గుడ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఆ ఫోటోకు ఫిదా అయిన ఒక నెటిజన్ ‘నాగచైతన్యకి విడాకులు ఇచ్చేయ్.. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం’ అంటూ కామెంట్ పెట్టాడు.
మామూలుగా అయితే కొందరు సెలబ్రిటీలు ఇలాంటి కామెంట్లకు స్పందిచకపోవడమో, స్పందించినా గట్టిగా సమాధానం చెప్పడమో చేస్తుంటారు. కానీ సమంత మాత్రం చాలా క్యాజువల్ గా రియాక్ట్ అయ్యారు. ‘కష్టం.. ఒక పని చెయ్.. చైని అడుగు’ అంటూ సరదాగా స్పందించారు. ఆమె స్పందన చూసిన నెటిజన్లు సాధారణంగా ఇలాంటి కామెంట్లకు కోప్పడతారు చాలామంది. కానీ అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడ సరదగా తీసుకుని ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. మీ వ్యక్తిత్వానికి హ్యాట్సాఫ్ అంటూ పొగిడేస్తున్నారు. ఇటీవలే ‘బిగ్ బాస్’ షోలో ఒక ఎపిసోడ్ కోసం వ్యాఖ్యాతగా వ్యవహరించిన సమంత త్వరలో ఒక టాక్ షోకు పూర్తిస్థాయి హోస్టుగా వ్యవహరించనున్నారు.