తన రాబోతున్న చిత్రాలలో సమంత విచిత్రమయిన పరిస్థితి ఎదుర్కుంటుంది ఇప్పటికే తన నటనతో మరియు అందంతో ప్రేక్షకుల గుండెలను కొల్లగొట్టిన సమంత. డాన్స్ విషయంలో కాస్త వెనకబడింది అనే చెప్పాలి మాస్ సాంగ్స్ చేసే సమయంలో సమంత కాస్త ఎక్కువగానే కష్టపడుతుంది. ఇదే విషయాన్నీ “మాస్ పాటలను చెయ్యడం చాల కష్టంగా ఉంది తరువాత చేసేప్పుడు ఇలా కష్టం అనిపించకూడదు అనుకుంటున్నా” అని ట్విట్టర్లో అన్నారు. ప్రస్తుతం ఈ నటి సిద్దార్థ్ సరసన నందిని రెడ్డి దర్శకత్వంలో నటిస్తుంది. ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కాకుండా సమంత “ఆటో నగర్ సూర్య”, “ఎటో వెళ్లిపోయింది మనసు”, “ఎవడు” మరియు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రీకరణలో పాల్గొంటుంది.