వంట రాదంటున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్


అందాలా భామ సమంత తన నటనతో మరియు గ్లామర్ తో తెరపై కనిపించి అందరినీ ఆకట్టుకుంది. చాలా విషయాల్లో టాలెంట్ ఉన్న సమంతని కుకింగ్ గురించి అడిగితే మాత్రం నా వల్ల కాదంటోంది. ఇప్పటికీ తనకి కుకింగ్ రాదంట. ‘ నేను కాఫీ బాగా చేసి ఇచ్చాను అంటే మీరు ఎంతో లక్కీ., దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు నేను ఎంత పెద్ద కుక్ అనేది. మా అమ్మ కుక్ చేస్తున్నప్పుడు చాలా వంటకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. మా అమ్మ చాలా మంచి కుక్, ఆమె వండే వంటకాలన్నీ సూపర్బ్ గా ఉంటాయని’ సమంత ఒక పత్రికతో అన్నారు.

ప్రస్తుతం సమంత గౌతమ్ మీనన్ డైరెక్షన్లో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వెర్షన్లో నాని హీరోగా నటించగా, మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. సమంత గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఏమాయ చేసావే’ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న సమంతకి ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా తన కెరీర్ కి మరింత ఊపందిస్తుందేమో చూడాలి.

Exit mobile version