‘ఎవడు’ సినిమాపై స్పందించిన సమంత

‘ఎవడు’ సినిమాపై స్పందించిన సమంత

Published on Nov 10, 2012 3:39 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ సినిమాలో సమంత స్థానంలో శ్రుతి హాసన్ ని తీసుకున్నారు అని వస్తున్న వార్తలపై సమంత స్పందించారు. ‘ మీరు విన్న వార్త నిజమే, ఎవడు సినిమాలో హీరోయిన్ గా నేను చేయడం లేదు, కానీ ఈ సారి నా డేట్స్ లేక కాదు, ఈ చిత్ర టీం తీసుకున్న క్రియేటివ్ నిర్ణయం వల్ల నేను సినిమా నుండి తప్పుకున్నాను అని’ ఆమె ట్వీట్ చేసారు. దీని వెనకున్న అసలైన నిజాన్ని మాత్రం ఇంకా తెలియ పరచలేదు. సమంత అన్న ‘క్రియేటివ్ నిర్ణయం’ అనేది ఏమిటా అనేది తెలియడం లేదు. 2013లో మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఇది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శ్రుతి హాసన్ మరియు అమీ జాక్సన్ జోడీ కడుతున్నారు.

అల్లు అర్జున్ మరియు కాజల్ అగర్వాల్ జంటగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ కి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2013 ఏప్రిల్ 5 న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

తాజా వార్తలు