ప్రపంచంలోని గొప్ప చిత్రాకారులలో రాజా రవి వర్మ ఒకరు. భారత దేశానికి చెందిన ఈయన తన గొప్ప కళాప్రావీణ్యంతో స్త్రీ అందానికి కొత్త భాష్యం చెప్పారు. అనేక మంది కవుల కల్పనకు రాజా రవి వర్మ పెయింటింగ్స్ ప్రేరణగా ఉన్నాయి. కాగా సీనియర్ హీరోయిన్ సుహాసిని నామ్ ప్రాజెక్ట్ పేరుతో రీ క్రియేటింగ్ రాజా రవి వర్మ 2020 నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆనాటి ప్రసిద్ధ పెయింటర్ రాజా రవి వర్మ పెయింటింగ్స్ ఫార్మ్ లోకి నేటి హీరోయిన్స్ తో ఫోటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సమంత, శృతి హాసన్ ఈ ఫోటో షూట్ నందు పాల్గొన్నారు.
అందమైన రవి వర్మ పెయింటింగ్ ఫార్మ్ లోకి జి వెంకటరామ్ అనే ఫోటోగ్రాఫర్ సమంత,శృతి హాసన్ లను మార్చివేశారు. సమంత, శృతిహాసన్ లు ఆ ఆర్ట్ ఫార్మ్ ఫోటోగ్రఫీలో నిజంగా రవి వర్మ వారిద్దరినీ చూస్తూ పెయింట్ చేస్తే ఎలా ఉంటారో అలా ఉన్నారు. ఈ ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్ లో భాగమైనందుకు సమంత, శృతి హాసన్ చాల ఆనందం వ్యక్తం చేశారు.
https://www.instagram.com/p/B8HJfxyBRYo/
https://www.instagram.com/p/B8HXHxMhDgt/