హైదరాబాద్ లో డాన్స్ చెయ్యనున్న సల్మాన్ ఖాన్

Salman-Khan
బాలివుడ్ కింగ్ సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్ళిన వార్తల్లో నిలిచే వ్యక్తి, అయన వెళ్తేనే పరిస్థితి ఇలా ఉంటె స్టేజ్ మీద డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నిజమండీ డిసెంబర్ 17న హైటెక్స్ లో సల్మాన్ ఖాన్ డాన్స్ చెయ్యనున్నారు. ఒక ప్రముఖ దిన పత్రిక నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఇది జరగనుంది, ప్రముఖ గాయకుడు సుక్వింధర్ సింగ్ పాట పాడుతుండగా సల్మాన్ డాన్స్ చెయ్యనున్నారు. ఈ కార్యక్రమంతో వచ్చిన ధనాన్ని సేవ కోసం ఉపయోగించనున్నారు. గత కొద్ది రోజులుగా సల్మాన్ “దబాంగ్ 2” చిత్ర ప్రమోషన్లో పాల్గొంటూ వస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది సొనక్షి సింగ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి అర్బాజ్ ఖాన్ దర్శకత్వం వహించారు.

Exit mobile version