200 కోట్లు క్రాస్ చేసిన సల్మాన్ ఖాన్ ‘ఏక్ థా టైగర్’

200 కోట్లు క్రాస్ చేసిన సల్మాన్ ఖాన్ ‘ఏక్ థా టైగర్’

Published on Aug 27, 2012 12:49 PM IST


బాలీవుడ్ బాద్షా సల్మాన్ ఖాన్ అని చెప్పుకోవడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. గత కొన్ని సంవత్సరాలుగా రంజాన్ కింగ్ గా నిలిచిన సల్మాన్ భాయ్ ఈ రంజాన్ కి విడుదల చేసిన ‘ఏక్ థా టైగర్’ చిత్రం 200 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. విడుదలైన 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 210 కోట్ల షేర్ సంపాదించింది. ఒక్క ఇండియా లోనే 12 రోజుల్లో 175 కోట్ల షేర్ సంపాదించింది. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘3 ఇడియట్స్’ చిత్రం మొత్తంగా ఒక్క ఇండియాలోనే 202 కోట్లు కలెక్ట్ చేసి లైఫ్ టైం రికార్డు సాదించింది. ఈ చిత్ర రికార్డులని బ్రేక్ చేసే దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది.

ఈ చిత్రం విడుదలైన 12 రోజుల్లోనే ఇలాంటి కలెక్షన్లు సాదించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఇండియా సీక్రెట్ ఏజెంట్ టైగర్ పాత్రలో కనిపించగా, కత్రినా కైఫ్ పాకిస్థాన్ ఐ.ఎస్.ఐ ఏజెంట్ పాత్రలో కనిపించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి కభీర్ ఖాన్ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా సల్మాన్ భాయ్ కి 123తెలుగు.కామ్ అభినందనలు తెలుపుతోంది.

తాజా వార్తలు