బాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పిన సల్మాన్ ఖాన్

Published on Aug 20, 2012 11:16 PM IST


గత కొన్ని సంవత్సరాలుగా రంజాన్ సమయంలో బాక్స్ ఆఫీసు దగ్గర కింగ్ గా నిలిచిన హీరో సల్మాన్ ఖాన్. వరుసగా కమర్షియల్ హిట్స్ సాదిస్తున్న సల్లూ భాయ్ ఈ రంజాన్ కి కూడా తన కొత్త చిత్రం ‘ఏక్ థా టైగర్’ తో బాలీవుడ్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఈ సినిమా విడుదలైన 5 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి బాలీవుడ్లో ఇప్పటి వరకూ ఏ చిత్రం సాదించని సరికొత్త రికార్డుని సాదించింది. ముస్లీం సోదరులు తమ రంజాన్ ఫాస్టింగ్ పూర్తవడంతో థియేటర్లలో సల్లూ భాయ్ ని చూడాలని పరగులు తీయడంతో కలెక్షన్లు మరింత ఊపందుకున్నాయి. ఈ కారణంగా ఈ వారం కూడా కలెక్షన్లకు డోఖా ఉండదని మరియు మొత్తంగా ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందా అని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. ఇప్పటికే సల్మాన్ ఖాన్ నటించిన మూడు సినిమాలు 100 కోట్ల మార్జిన్ ని క్రాస్ చేసాయి. బహుశా సల్మాన్ ఖాన్ ని బాలీవుడ్ బాద్షా అనడానికి ఇదే సరైన సమయం.

తాజా వార్తలు