నిజంగా ఇప్పుడు సాయి తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ సినిమా విడుదల మొత్తం తెలుగు ఇండస్ట్రీకే ఎంతో కీలకం అని చెప్పాలి. దీనికి వచ్చిన రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంది అన్న దాని బట్టే ఆడియెన్స్ ఎలా ఉన్నారు అన్న అంచనా ప్రతీ ఒక్కరికీ కలుగుతుంది.
అలా మన స్టార్ హీరోలు సినీ పెద్దలు పెట్టుకున్న నమ్మకానికి ఆడియెన్స్ మంచి రిజల్ట్ నే అందించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. లాక్ డౌన్ తర్వాత డేర్ చేసి నిబంధనలతో విడుదల కాబడిన సినిమా ఇది దీనితో మేకర్స్ లో కూడా ఎక్కడో చిన్న టెన్షన్ ఉంది కానీ ఈ చిత్రానికి మొదటి రోజే సూపర్ స్ట్రాంగ్ వసూళ్లు రావడం ఖాయం అన్నట్టే టాక్ వినిపిస్తుంది.
నూన్ షోకే దగ్గరదగ్గరగా కోటి రూపాయల గ్రాస్ ను ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేసాయి. సో సాయి తేజ్ టీమ్ పెట్టుకున్న నమ్మకం నిలబడినట్టే అని చెప్పాలి. మరి ఫైనల్ ఫిగర్స్ ఎక్కడ ఆగుతాయో చూడాలి. ఈ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహించగా నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. అలాగే థమన్ సంగీతం అందించాడు.