A వచ్చి B పై వాలిందంటున్న సాయిరామ్ శంకర్


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడిగా తెరంగేట్రం చేసిన సాయిరామ్ శంకర్ కి చెప్పుకోదగ్గ హిట్స్ తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి ఇలా వరుస సినిమాలు ఒప్పుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ‘రోమియో’ మరియు ‘యమహో యమః’ అనే రెండు చిత్రాలు చేస్తున్న సాయిరామ్ శంకర్ మరో రెండు చిత్రాలను ఒప్పుకున్నారు. అందులో ఒకటి దర్శకుడిగా మూడు హిట్లు అందుకొని, ఆ తర్వాత హిట్ లేక ఆపసోపాలు పడుతున్న తేజతో ‘వేయి అబద్ధాలు’ అనే సినిమా చేయనున్నాడు. ఈ సినిమా ఈ నెల 17న ప్రారంభం కానుంది. ఇది కాకుండా ‘A వచ్చి B ఫై వాలె’ అనే సినిమా కూడా ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా సుందర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తేజ సాయిరామ్ శంకర్ తో హిట్ కొట్టి ఇద్దరూ హిట్ పెయిర్ అనిపించుకుంటారేమో చూడాలి.

Exit mobile version