సాయి పల్లవి సాంగ్ ఆగడం లేదు.!

సాయి పల్లవి సాంగ్ ఆగడం లేదు.!

Published on Mar 12, 2021 8:51 AM IST

అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా స్టార్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “లవ్ స్టోరీ”. ఈ ముగ్గురు కెరీర్ లోనే భారీ హైప్ తో తెరకెక్కిన ఈ చిత్రం కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి సాయి పల్లవి మార్క్ సాంగ్ ను మరొకటి ఇటీవలే మేకర్స్ విడుదల చేశారు.

“సారంగ దరియా” అంటూ పక్కా తెలంగాణా ఫోక్ సాంగ్ ను విడుదల చెయ్యగా దానికి ఇప్పుడు యూనానిమస్ రెస్పాన్స్ వస్తుంది. గత సాయి పల్లవి మరియు శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన గత చిత్రం “ఫిదా” వచ్చిండే కు ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుంది ఇది కూడా అదే రీతిలో ఇటీవల కాలంలో బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయ్యింది. కేవలం 3 వారాల్లో 41 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసేసింది.

అంతే కాకుండా 7 లక్షలకు పైగా లైక్స్ కూడా ఈ సాంగ్ రాబట్టేసింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే గత వారంలోనే ఒక్కసారిగా వ్యూస్ పెరుగుతుండడం గమనార్హం. మొత్తానికి మాత్రం సాయి పల్లవి సాంగ్ యూట్యూబ్ లో ఆగడం లేదు. మరి ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు అమిగోస్ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు