సాయి కుమార్ ‘అరి’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైలైట్స్!

సాయి కుమార్ ‘అరి’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైలైట్స్!

Published on Oct 9, 2025 7:44 AM IST

ప్రముఖ నటీనటులు వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. “పేపర్ బాయ్” చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘అరి’ సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. బుధవారం రాత్రి హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ పలువురు రాష్ట్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో

నిర్మాత తిమ్మప్ప నాయుడు పురిమెట్ల మాట్లాడుతూ.. అరిషడ్వర్గాల నేపథ్యంగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి మా దర్శకుడు జయశంకర్ ‘అరి’ సినిమాను రూపొందించాడు. కథ విన్నప్పుడే ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమా కాన్సెప్ట్ ను ఎంతోమంది పెద్దవాళ్లు ప్రశంసిస్తున్నారు. మూవీకి థియేటర్స్ లో మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ.. అరిషడ్వర్గాల వల్ల కలిగే ఉద్రేకాల వల్లే మనిషి చెడిపోతాడు. అలాంటి అరిషడ్వర్గాల ఆధారంగా జయశంకర్ సినిమా రూపొందించడం అభినందనీయం. ఇది సమాజానికి మంచి చేస్తుంది కాబట్టే సినిమా కార్యక్రమానికి వచ్చాం. అరి సినిమా చూడండి ఆ హరికి దగ్గరవ్వండి. అన్నారు.

అలాగే నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. అరిషడ్వర్గాల ఆధారంగా దర్శకుడు జయశంకర్ ‘అరి’ సినిమాను రూపొందించారు. ఎలా చెబితే యూత్ కు సందేశం చేరుతుందో అలా ఈ సినిమాను తెరకెక్కించారు. యూఎస్ లో ఉండే ప్రొడ్యూసర్స్ రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు సినిమా మీద ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ టీమ్ అందరికీ ‘అరి’ సినిమా పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

మరో నిర్మాత దామోదరప్రసాద్ మాట్లాడుతూ.. ‘అరి’ సినిమా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా రూపొందించారు కాబట్టి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా..ఇప్పుడు పర్పెక్ట్ రిలీజ్ కు వస్తోంది. కంటెంట్ బాగున్న ప్రతి సినిమా ఆదరణ పొందుతుంది. అలాగే ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా. అన్నారు.

నటుడు వినోద్ వర్మ మాట్లాడుతూ.. దర్శకుడు జయశంకర్, నేను గతంలో ఓ షార్ట్ ఫిలిం చేశాం. దానికి మంచి పేరొచ్చింది. ‘అరి’ సినిమాలో కీ రోల్ చేయాలని నన్ను పిలిచాడు. ఈ మూవీలో ఎప్పుడూ ఫ్రెష్ గా కనిపించాలని అన్నాడు. అలాగే మూడు పేజీల డైలాగ్స్ కూడా చెప్పాను. సాయి కుమార్ లాంటి యాక్టర్ తో వర్క్ చేసినప్పుడు మాత్రం భయమేసింది. మనలోని భావోద్వేగాలను నియంత్రించుకోవాలనే మంచి కాన్సెప్ట్ ను ఎంటర్ టైనింగ్ రూపొందించాడు జయశంకర్. మంచి కంటెంట్ ను ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘అరి’ సినిమాను కూడా మీరు సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాం. అన్నారు.

గ్లామరస్ నటి అనసూయ మాట్లాడుతూ.. ‘అరి’ సినిమాకు వర్క్ చేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ఆంథాలజీ తరహాలో సాగే చిత్రమిది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది. ఆ పాత్ర ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద చూడాలి. మంచి సందేశం, ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ‘అరి’ చిత్రాన్ని మీరు చూసి సక్సెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అన్నారు.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. డైరెక్టర్ జయశంకర్ ‘అరి’ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు కూడా ఎంజాయ్ చేశాం. ఈ మూవీలో ఆరుగురు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు. వారిలో సాయి కుమార్ గారు ఒక క్యారెక్టర్ చేయడం హ్యాపీగా ఉంది. ‘అరి’ లాంటి మూవీ చేయడం సులువు కాదు. నిర్మాతలకు నా అభినందనలు చెబుతున్నా. మనలోని వీక్ నెస్ లను ఓవర్ కమ్ చేయాలని చెప్పే మంచి చిత్రమిది. ఈ సినిమాను ప్రేక్షకులు మిస్ కాకూడదు అని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ జయశంకర్ మాట్లాడుతూ.. ‘అరి’ సినిమా మనల్ని మనం చూసుకునే అద్దం లాంటిది. అరిషడ్వర్గాల కాన్సెప్ట్ ను ఎంతోమంది సద్గురులను కలిసి ఒక ఎంటర్ టైనింగ్ గా ఈ చిత్రంలో రూపొందించాను. ఈ సినిమా చూసి బయటకు వచ్చాక, ఆ పాత్ర నేనే కదా అనే ఫీల్ కలుగుతుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. మా ప్రొడ్యూసర్ ఆర్వీ రెడ్డి గారు లేకుంటే అరి సినిమా లేదు. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్ తో ఆయన ట్రావెల్ అవుతూ మమ్మల్ని నడిపిస్తున్నారంటే ఆయనకు సినిమా మీదున్న ప్యాషన్ ను అర్థం చేసుకోవచ్చు. అరి సినిమా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తిమ్మప్ప నాయుడు గారు వచ్చి ఆదుకున్నారు. మా చిత్రంలోని ఆరు పాత్రల్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది సాయికుమార్ గారిని. ఆయన పర్ ఫార్మెన్స్ అద్భుతంగా చేశారు. అలాగే నా స్నేహితుడు వినోద్ వర్మకు ఈ చిత్రంతో మంచి పేరొస్తుంది. అన్నారు.

ఇక విలక్షణ నటుడు సాయికుమార్ మాట్లాడుతూ.. పురాణ ఇతిహాసాల గురించి చిన్నప్పుడు అమ్మ నాకు చెప్పేది. జయశంకర్ అరిషడ్వర్గాల నేపథ్యంగా సినిమా అని చెప్పిప్పుడు కొత్తగా అనిపించింది. ఆరు పాత్రలతో జయశంకర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మా ఆరు పాత్రలు ఎక్కడా కలవవు. అందుకే మీతో పాటు నేను కూడా థియేటర్ లో ఈ సినిమా ఎలా వచ్చిందో చూడాలని అనుకుంటున్నా. నా 50 ఏళ్ల నట జీవితంలో అరి లాంటి చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నా. ఈ సినిమాకు కనిపించే మూడు సింహాల్లాంటి ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్నారు. కనిపించని నాలుగో సింహం లాంటి ప్రొడ్యూసర్ మా ఆర్వీ రెడ్డి గారు అమెరికాలో ఉంటారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ బాగా నటించారు. వినోద్ వర్మ నటన ఆకట్టుకుంటుంది. అనూప్ మ్యూజిక్ బాగుంది. ఇతర క్రూ అంతా కష్టపడి పనిచేశారు. ఈ మధ్య గంగాధర శాస్త్రి గారి భగవద్గీతకు వచనం చెప్పాను. జేడీ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో చేస్తున్న ప్రాజెక్ట్ కు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 108 శ్లోకాలకు తెలుగు వెర్షన్ చెప్పాను. అలాగే జీఎంఆర్ వాళ్లు భగవద్గీతను తెలుగులోకి తీసుకొస్తూ నన్నే వాయిస్ చెప్పమన్నారు. అలా ఈ మధ్య నాపై శ్రీకృష్ణుడు దయ చూపిస్తున్నాడు. మనం ఆధునికంగా ఎంత ఎదిగినా మన నాగరికత మర్చిపోకూడదు. ఒక మంచి సందేశాన్ని సినిమా అనే పవర్ ఫుల్ మీడియా ద్వారా చెబుతున్నాం. పెద్దలంతా మా మూవీని ఆశీర్వదించారు. వెంకయ్య నాయుడు గారు మోడరన్ భగవద్గీత అన్నారు. ఇలాంటి గొప్ప సినిమాను మీరంతా థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నా” అని తెలిపి ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు