సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రమే “సంబరాల ఏటి గట్టు”. దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్ పట్ల మంచి హైప్ ఉంది. ఐతే, వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఈ రోజు తిరుమలను సందర్శించాడు సాయి తేజ్. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన వివాహం గురించి కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాది తన పెళ్లి జరుగుతుందని సాయి దుర్గ తేజ్ క్లారిటీ ఇచ్చారు.
ఇక “సంబరాల ఏటి గట్టు” వచ్చే ఏడాది విడుదల కానుందని, కానీ ఖచ్చితమైన తేదీ ఇంకా ఖరారు కాలేదని సాయి దుర్గ తేజ్ పేర్కొన్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుండగా, ఈ చిత్రాన్ని కె. నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవి కృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.


