మెగా ఫ్యామిలీ నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్న మరో హీరో సాయి ధరంతేజ్. అతను ముందుగా ‘రేయ్’ సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయంకావాల్సివున్నా ఆ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ప్రస్తుతం సాయి తన తదుపరి సినిమాపై దృష్టిపెట్టాడు
సాయి ధరం తేజ్ మరియు రెజీనా కలిసి ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను గబ్బర్ సింగ్ సినిమా పాటనుండి తెచ్చుకున్నారు. ఇప్పటికే నితిన్ గబ్బర్ సింగ్ సినిమాలో ఒక పాటను టైటిల్ గా పెట్టి హిట్ కొట్టాడు, ఈ చిత్రం ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగనుంది. ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి
బన్నీ వ్యాస్ మరియు హర్షిత్ రెడ్డి సంయుక్త నిర్మాతలు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. ఏ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకుడు