మళ్లీ వాయిదా పడ్డ సాహసం విడుదల ?

మళ్లీ వాయిదా పడ్డ సాహసం విడుదల ?

Published on Jun 14, 2013 2:42 PM IST

Sahasam Audio Launch

హీరో గోపీచంద్ నటించిన సినిమా ‘సాహసం’. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాని జూన్ 21 న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా విడుదల తేదిని జూలై 5కి మార్చారని సమాచారం. ఈ సమాచారం నమ్మశక్యమైనదే. ఈ విషయాన్ని అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటించింది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఈ సినిమాలోని యాక్షన్ అడ్వెంచర్ సన్నివేశాలకు ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లరి నరేష్ నటించిన ‘యాక్షన్ 3డి’ సినిమా కూడా జూన్ 21 న విడుదలవుకానుండడంతో ‘సాహసం’ సినిమా విడుదలని వాయిదా వేసివుంటారని అనుకుంటున్నారు.

తాజా వార్తలు