భావోద్వేగాలను, సెంటిమెంట్ సీన్లను సున్నితంగా తెరకెక్కించడంలో దర్శకరత్న దాసరి నారాయణరావు గారి స్థానం చెక్కు చెదరనిది. నిన్న జరిగిన శ్రీకాంత్ ‘మొండోడు’ సినిమా అదుఇఒ ఫంక్షన్ లో దాసరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ” ఈరోజును చూస్తున్న నేను ఎందుకు బతికున్ననా అని బాధగావుంది” అని అన్నారు
అదేంటి అంతమాట అనేశారు అని కంగారుపడకండి. పూర్తిగా చదవండి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాల విడుదలలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ మాట అన్నారు. ” ప్రస్తుతం తెలుగు సినిమా రంగం వున్నా పరిస్థితిని చూస్తుంటే నేను చాలా అసహనానికి లోనవుతున్నా. చిన్న సినిమాల విడుదల గురించి పట్టించుకోకుండా భారీ బడ్జెట్ సినిమాలు తన విడుదలను వాయిదా వేసేస్తున్నాయి. ఇలాంటి రోజును చూస్తున్న నేను ఎందుకు బతికున్ననా అని బాధగావుంది” అని అన్నారు
“ఈ బాధలేమీ లేకుండా ‘మొండోడు’ సినిమా విడుదలకావాలని కోరుకుంటున్నా” అని జతకలిపారు. భారీ బడ్జెట్ సినిమాలు తన విడుదలను వాయిదా వేసేస్తున్న మాట నిజమే. దానివల్ల చిన్న సినిమాలు బాధపడుతున్నాయి అన్నది సైతం నిజమే. కానీ వీటన్నిటికీ కారణం రాష్ట్ర రాజకీయనేపధ్యం.. పెద్ద సినిమా నిర్మాతలూ ఈ భాద బారిన పడతున్నారనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం