మళయాళ ప్రముఖ టాలెంటెడ్ నటుడు షైన్ టామ్ చాకో అంటే మన తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగానే తెలుసు. నాచురల్ స్టార్ నాని దసరా లో విలన్ గా రీసెంట్ గా దేవర, డాకు మహారాజ్ ఇంకా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలలో కూడా కీలక పాత్రలో నటించిన ఈ నటుడు ఈ మధ్య పలు వివాదాల్లో కూడా కనిపించాడు.
అయితే ఈ నటుడు విషయంలో ఒక విషాద వార్త ఇపుడు బయటకి వచ్చింది. తాను సహా తన కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైనట్టుగా ఇపుడు తెలిసింది. బెంగళూరు, సేలం హై వేలో వీరికి కారు ప్రమాదం జరగగా ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు నటుడు తండ్రి సిపి చాకో మృతి చెందారట.
అలాగే తన తల్లికి, సోదరుడు, డ్రైవర్ లకి ఇంకా షైన్ టామ్ చాకోకి కూడా గాయాలు అయ్యినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వారికి దగ్గరలోనే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుందట. అయితే ఈ ప్రమాదంలో తన తండ్రి మరణించడం అనేది విషాదమే అని చెప్పాలి. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని అలాగే షైన్ టామ్ చాకో కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.