‘సెబాస్టియన్ పిసి 524’ కోసం ‘సాహో’ టెక్నీషియన్

‘సెబాస్టియన్ పిసి 524’ కోసం ‘సాహో’ టెక్నీషియన్

Published on Dec 23, 2020 12:00 AM IST

‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ కాగా రెండవది ‘సెబాస్టియన్ పిసి 524’. ప్రస్తుతం ‘సెబాస్టియన్ పిసి 524’ షూటింగ్ జరుగుతోంది. ఇందులో కిరణ్ అబ్బవరం పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. బాలాజీ సయ్యపురెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రమోద్, రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఘిబ్రన్ సంగీతం అందించనున్నారు. ఘిబ్రన్ తమిళంలో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో ‘జిల్, హైపర్, రన్ రాజా రన్, రాక్షసుడు’ లాంటి సినిమాలు సంగీతం అందించారు. తెలుగులో ఆయన చేసిన చివరి చిత్రం ప్రభాస్ యొక్క ‘సాహో’. అంత పెద్ద భారీ బడ్జెట్ చిత్రం తర్వాత ఆయన ఒప్పుకుంది ‘సెబాస్టియన్ పిసి 524’ చిత్రానికే కావడం విశేషం. తెలుగుతో పాటు తమిళంలో కూడ ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో హీరో రేచీకటి సమస్యతో ఇబ్బందిపడే కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు.

తాజా వార్తలు