15 కల్లా ముగియనున్న ఎన్.టి.ఆర్ మూవీ షెడ్యూల్

15 కల్లా ముగియనున్న ఎన్.టి.ఆర్ మూవీ షెడ్యూల్

Published on Jun 9, 2013 10:11 PM IST

Ramayya-Vasthavayya2

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సమంత, శృతి హాసన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ డైరెక్టర్. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్.టి.ఆర్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా తాజా షెడ్యూల్ మైసూర్ ప్రాంతంలో మొదలైంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ – శృతి హాసన్ లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను మేలుకోటె ప్రాంతంలో షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ జూన్ 15 కల్లా పూర్తవుతుందని సమాచారం. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి హరీష్ శంకర్ చాలా ఆనందంగా ఉన్నాడు ముఖ్యంగా అదే రెస్పాన్స్ కర్ణాటకలో కూడా రావడంతో ఇంకా హ్యాపీగా ఉన్నాడు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు