శ్రీనివాస్ రెడ్డి తో నాగ చైతన్య ఒక చిత్రం చేయ్యనున్నాడని పలు వార్తలు వెలువడ్డాయి. ఈ చిత్రాన్ని డి శివప్రసాద్ రెడ్డి కామాక్షి మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారని లాంచనంగా ప్రకటన కూడా చేశారు. ఈ చిత్రం గురించి మరో ప్రకటన లేకపోయినా పలు పుకార్లు వినిపిస్తున్నాయి. నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన “హలో బ్రదర్” చిత్రానికి రీమేక్ అని వార్తలు వచ్చాయి. ఒక ప్రముఖ పత్రిక ఈ చిత్రం గురించి ప్రచురించింది నాగార్జున చిత్రాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మార్చే ప్రయత్నంలో శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని ప్రకటించింది. అంతే కాకుండా నాగ చైతన్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు కనుక ఈ చిత్రంలో సమంత మరియు తమన్నా కథానాయికలుగా నటించే అవకాశం ఉండవచ్చని ప్రకటించింది. వినడానికి ఇవన్ని బాగున్నా అధికారికంగా ప్రకటన వెలువడేంత వరకు వేచి చూడవలసిందే.
నాగ చైతన్య ప్రస్తుతం “వెట్టై” చిత్ర రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కిషోర్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నాగ చైతన్య , తమన్నా, సునీల్ మరియు ఆండ్రియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేవకట్ట దర్శకత్వంలో “ఆటోనగర్ సూర్య” చిత్రంలో రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్నారు.