అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీ పై వస్తున్న రూమర్స్?

Allu-arjun
ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం నిజమైతే అల్లు అర్జున్ త్వరలోనే తన తొలి తమిళ సినిమాలో నటించబోతున్నాడు. చాలా రోజుల క్రితమే అల్లు అర్జున్ తనకు ఓ డైరెక్ట్ తమిళ సినిమాలో నటించాలని ఉందని తెలిపాడు. అప్పట్లో కొంతమంది తమిళ డైరెక్టర్స్ తో కథా చర్చలు కూడా జరిగాయి కానీ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. ఒక ప్రముఖ దిన పత్రిక అల్లు అర్జున్ త్వరలోనే తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడని ప్రచురించడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ‘ఓకే ఓకే’, ఎస్.ఎం.ఎస్ సినిమాలకు దర్శకత్వం వహించిన రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కె.ఈ. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. రాజేష్ ప్రస్తుతం కార్తీ, కాజల్ నటిస్తున్న ‘అల్ ఇన్ అల్ అజుగు రాజ ‘ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ లో భాగంగా స్పెయిన్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు అల్లు అర్జున్ స్పెయిన్ నుండి రాగానే తెలిసే అవకాశం వుంది. ఈ సినిమాకి డేట్స్ ఇచ్చేదాని కంటే ముందు అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి సినిమాని పూర్తి చేయాల్సి ఉంది .

Exit mobile version