గుణశేఖర్ రాబోతున్న చిత్రం “రుద్రమదేవి” ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి వేగంగా సాగుతున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలలో రానున్న ఈ చారిత్రాత్మక 3D చిత్రం రాణి రుద్రమ దేవి కథ ఆధారంగా తెరకెక్కించనున్నారు. ఈ మధ్యనే గుణశేఖర్ జర్మనీ వెళ్లి అక్కడ ఈ చిత్ర ట్రయిల్ షూట్ చేశారు ప్రస్తుతం అయన వరంగల్ లో కాకతీయుల విధి విధానాల గురించి రీసెర్చ్ చేస్తున్నారు. “జర్మనీ లో ఒక వారం పాటు టెస్ట్ షూట్ చేశాం ఫలితం చాలా సంతోషాన్ని ఇచ్చింది ప్రస్తుతం వెయ్యి స్తంభాల గుడి వంటి చారిత్మాతక ఘట్టాల గురించి తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాను” అని గుణశేఖర్ అన్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించనున్నారు అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు కమల్ కన్నన్ VFX పర్యవేక్షిస్తారు. ఈ చిత్రం 2013లో మొదలు కానుంది.