అనుష్క పుట్టినరోజు సందర్భంగా రుద్రమదేవి టీజర్

Rudrama-Devi
డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం ‘రుద్రమ దేవి 3డి’ తెరకెక్కించే పనిలో వున్నాడు. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి టీజర్ ను నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను కటింగ్ ఎడ్జ్ 3డి పరిజ్ఞానంతో ప్రపంచస్థాయి నిపుణుల సహకారంతో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో కళ్ళుచెదిరే సెట్ నిర్మించారు. ఈ సెట్ లను అంత అందంగా తోట తరుణి తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమాలో హ్యాండ్సమ్ హంక్ రానా ఒక ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ‘రుద్రమ దేవి 3డి’ 2014 మధ్యలో విడుదలకావచ్చు

Exit mobile version