ఇంతకు ముందే “RRR” యూనిట్ తమ ఫాలోవర్స్ కు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ తమ సినిమా విషయంలో ఎంటర్టైనింగ్ గానే అదిరిపోయే హింట్స్ ఇస్తున్నారని చెప్పుకొన్నాము. అలాగే లేటెస్ట్ గా కూడా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కు హింటిచ్చారు. ఎలాగో ఇది దీవాళీ సీజన్ కాబట్టి మంచి సినిమాల విషయంలో అప్డేట్స్ అనేవి కామన్.
అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల అభిమానులు వీరి యూనిట్ నుంచి కూడా అప్డేట్ ఆశించారు. అలా అడిగితేనే దీవాళీ కి ఇచ్చే అప్డేట్ ముందే అంటే ఈరోజే ఉందని అంటున్నారు. దీనితో ఈ షో ఇరువురి హీరోల అభిమానుల్లో ఆ అప్డేట్ ఏంటా అని మంచి ఎగ్జైట్మెంట్ మొదలయ్యింది.
మరి వీరు ఈరోజు ఇచ్చే ఆ అప్డేట్ ఏంటో చూడాలి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటులు అజయ్ దేవగణ్ అలాగే ఆలియా భట్ లు నటిస్తుండగా లెజెండరీ మ్యూజిషియన్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్లకు పైగా భారీ వ్యవంతో నిర్మిస్తున్నారు.
Eeroje Annaa… ???? #RRRDiwali pic.twitter.com/Ib8RKJSaOi
— RRR Movie (@RRRMovie) November 13, 2020