టాలీవుడ్ టాప్ స్టార్స్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా…చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. చాలా కాలం తరువాత నందమూరి హీరో, మెగా హీరో కలిసి నటిస్తున్న సినిమా కావడం కూడా మరో విశేషం. అప్పుడెప్పుడో ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించారు. తరువాత ఇన్నేళ్లకు దర్శక ధీరుడు రాజమౌళి ఈ అరుదైన కాంబినేషన్ సాకారం చేశారు.
ఐతే సినిమా ప్రకటించినప్పటి నుండి మెగా మరియు నందమూరి అభిమానుల్లో ఓ సందేహం ఉంది. ఈఇద్దరు హీరో పాత్రలలో ఎవరికైనా ఎక్కవ ప్రాధాన్యం ఉండి, మరోక హీరోకి తక్కువ ప్రాధాన్యం ఉంటుందా అని. దీనిపై మొదట్లోనే రాజమౌళి క్లారిటీ ఇచ్చినా ఎక్కడో వారికి డౌట్ కొడుతూనే ఉంది. ఐతే ఈ విషయంలో ఇరు హీరోల ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. కథలో ప్రతి విషయంలో ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యత ఉండేలా రాజమౌళి తగు జాగ్రత్తలు తీసుకున్నారట. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా వారి పాత్రలు ఉంటాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది .