ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో మూడు కొత్త చిత్రాలు


గత కొంత కాలంగా భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించి వరుస విజయాలు సాదిస్తున్న ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ వారు మూడు కొత్త చిత్రాలు ప్రారంబించనున్నారు. ఈ చిత్రాలను ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో మూడు వేరే బ్యానర్లపై నిర్మించనున్నారు, అందులో మాక్స్ ఇండియా బ్యానర్ పై నిర్మించే చిత్రానికి కామెడీ చిత్రాల దర్శకుడు శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తారు, ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నిర్మించే సినిమాకు ఆర్.పి పట్నాయక్ దర్శకత్వం వహిస్తారు మరియు ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించే ‘లవ్ లాంగ్వేజ్’ మూవీకి వాసు దర్శకత్వం వహిస్తారు. ఈ మూడు చిత్రాల పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ మూడు చిత్రాల్లో నూతన నటీనటులు నటించనుండడం విశేషం.

Exit mobile version