మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆర్పీ పట్నాయక్

ఆర్పీ పట్నాయక్.. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన వ్యక్తి. ‘జయం, చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, దిల్, నీకు నేను నాకు నువ్వు, ఆ నలుగురు’ లాంటి ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. సుమారు ఒక ఆరేడేళ్లు ఇండస్ట్రీలో ఆయన హవానే నడిచింది. అలా సంగీత దర్శకుడిగా మంచి స్థాయిలో ఉండగానే నటుడిగా కొత్త టర్న్ తీసుకున్నారు. అటుపై దర్శకుడిగా మారి అరడజనుకు పైగా సినిమాలు చేశారు. కానీ సంగీత దర్శకుడిగా దొరికిన సక్సెస్ దర్శకుడిగా మారినప్పుడు దొరకలేదు ఆయనకు.

వరుస వైఫల్యాలతో ఢీలా పడిన ఆయన కొన్నాళ్ళు సైలెంట్ అయ్యారు. మళ్లీ మెగాఫోన్ పట్టి దర్శకత్వంలోకి దిగారు. కొత్తగా ఆయన డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘కాఫీ విత్ కిల్లర్’. ఇదొక కామెడీ థ్రిల్లర్. షూటింగ్ కూడ పూర్తైపోయిందట. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే ఆయనే. నిర్మాత కూడ ఆయనే. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా బాద్యత మొత్తం ఆయనే మోశారు. కొద్దిసేపటి
క్రితమే సినిమా సంగతులు రివీల్ చేశారు. త్వరలోనే విడుదలకు సంబంధించిన వివరాలు కూడ తెలుపుతారట. ఈ కొత్త ప్రయత్నంతో అయినా దర్శకుడిగా విజయవంతం కావలనేది ఆర్పీ తపన.
వరుస పరాజయాల తర్వాత చేస్తున్న ఈ చిత్రం ఆయనకు పెద్ద పరీక్షే. ఈ పరీక్షలో ఆయన విజయం సాధించాలని కోరుకుందాం.

Exit mobile version