“రొటీన్ లవ్ స్టొరీ” చిత్ర ట్రైలర్ కి అనూహ్య స్పందన


తెలుగు పరిశ్రమలో ప్రేమకథా చిత్రాలకు ప్రత్యేకత ఉంది. ప్రతి వారం మన పరిశ్రమ నుండి ప్రేమకథ చిత్రాలు రావడం సర్వసాధారణం అయిపోయింది ఎంతలా అంటే ప్రేక్షకులకు లవ్ స్టోరీస్ అంటే రొటీన్ అనిపించేలా. ఇదే అంశం మీద ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సందీప్ కిషన్ మరియు రెజినా ప్రధాన పాత్రలలో వస్తున్న “రొటీన్ లవ్ స్టొరీ” వస్తుంది. ప్రతి ప్రేమ కథ విభిన్నంగానే ఉంటుంది కాని చూసేవాడికి లేదా వినేవాడికి మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది ఈ చిత్రంలో ఒక జంట రొటీన్ ప్రేమకథను విభిన్నంగా చుపెట్టాము అని ప్రవీణ్ సత్తారు అన్నారు. నిన్న విడుదలయిన ఈ చిత్ర ట్రైలర్ కి యూట్యూబ్ లో అద్భుతమయిన స్పందన కనిపించింది. సిద్దార్థ్,లక్ష్మి మంచు,తాప్సీ, స్నేహ ఉల్లాల్ మరియు శ్రద్ద దాస్ వంటి పలువురు సిని ప్రముఖులు ఈ ట్రైలర్ ని ప్రశంసించారు. చాణక్య నిర్మించిన ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. సురేష్ భార్గవ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్ర ఆడియో మరో రెండు వారాల్లో విడుదల అవుతుండగా చిత్రాన్ని అక్టోబర్ 26 కాని నవంబర్ మొదటి వారంలో కాని విడుదల చెయ్యనున్నారు.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version