తమిళ హీరోలని పొగిడేస్తున్న రిచా

richa-gangopadhyay
లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన బొద్దుగుమ్మ రిచా గంగోపాధ్యాయ్ తాజాగా ‘మిర్చి’సినిమాతో ఓ సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ భామ ఒక్క తెలుగులోనే కాక తమిళంలో టాప్ హీరోలైన ధనుష్, శింబు లతో కలిసి పనిచేసింది. వాళ్ళతో చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నా చాలా మళ్ళీ రిచాకి తమిళంలో ఆఫర్లు రాలేదు కానీ ఈ భామ మాత్రం ఇప్పటికీ వారిద్దరినీ పొగిడేస్తోంది. ‘ధనుష్, శింబులు ఇద్దరూ రెండు విభిన్న వ్యక్తిత్వాలు కలవారు కానీ వారిద్దరికీ మ్యూజిక్ విషయంలో మరియు నటన విషయంలో మంచి నాలెడ్జ్ ఉందని’ రిచా చెబుతోంది.

ప్రస్తుతం రిచా గంగోపాధ్యాయ్ నాగార్జున సరసన ‘భాయ్’ సినిమాలో నటిస్తోంది. వీరభద్రం చౌదరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.

Exit mobile version