కార్తి సరసన రిచా గంగోపాధ్యాయ్


రిచా గంగోపాధ్యాయ్ ఈ మధ్య కాలంలో చాలా చిత్రాలను ఒప్పుకుంటుంది. గత కొద్ది నెలలుగా ఈ భామ ఎటువంటి చిత్రం ఒప్పుకోలేదు అకస్మాతుగా మూడు చిత్రాలను ఒప్పుకుంది. ఇప్పటికే రవితేజ “సార్ వస్తార” మరియు నాగార్జున “భాయ్” చిత్రాలలో కథానాయికగా నటిస్తున్న ఈ భామ తాజాగా కార్తి చిత్రం “బిరియాని”లో కనిపించనుంది. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఇలియానా,పరినీతి చోప్రా మరియు కాజల్ అగర్వాల్ లను ఈ పాత్రల కోసం తీసుకోవాలని అనుకున్నారు. “అవును నేను చేస్తున్న తరువాత చిత్రాలు వెంకట్ ప్రభు “బిరియాని” తెలుగు/తమిళ్ మరియు వీరభద్రం “భాయ్” లో నాగార్జున సరసన నటిస్తున్నాను వేచి చూసినందుకు మంచి చిత్రాలు దొరికాయి” అని రిచా ట్విట్టర్లో చెప్పారు. త్వరలో ఈ భామ రవి తేజ “సార్ వస్తారా” చిత్ర బృందంతో ఊటీలో కలుస్తుంది. దీని తరువాత నాగార్జున “భాయ్” చిత్రీకరణలో పాల్గొంటుంది.

Exit mobile version