మిర్చి పై ఆశలు పెట్టుకున్న రిచా

Richa-Gangopadhyay
లీడర్ సినిమాతో తెలుగు వారి ప్రేక్షకులకు పరిచయమైన రిచా గంగోపాధ్యాయ ఆ తర్వాత మిరపకాయ్ సినిమాతో తొలి కమర్షియల్ హిట్ అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె నటించిన సారొచ్చారు సినిమాతో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పటివరకూ బ్లాక్ బస్టర్ హిట్ లేని రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించిన ‘మిర్చి’ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియో హిట్ అవ్వడం, అలాగే ట్రైలర్స్, హీరో ప్రభాస్ లుక్ సూపర్బ్ గా ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా హిట్ తన కెరీర్ కి చాలా కీలకం కానుండడంతో రిచా తన ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకుంది.

Exit mobile version