రియా కోసం సల్మాన్, సంజయ్ దత్ లాయర్.

రియా కోసం సల్మాన్, సంజయ్ దత్ లాయర్.

Published on Jul 29, 2020 12:11 PM IST

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు అనేక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులను ఈ కేసులో విచారించడం జరిగింది. కాగా సుశాంత్ మరణించిన ఇన్ని రోజుల తరువాత ఆయన తండ్రి రియా చక్రవర్తిపై కేసు పెట్టడం సంచలనంగా మారింది. దాదాపు ఆమె అరెస్ట్ లాంఛనమే అని తెలుస్తుండగా, రియా ఇంటెరిమ్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.దానితో పాటు ముంబై కి చెందిన ఓ ప్రముఖ లాయర్ ని రియా చక్రవర్తి నియమించుకున్నారు.

గతంలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖుల కేసులు డీల్ చేసిన సతీష్ మాన్షిండే అనే ప్రముఖ లాయర్ ని ఈ కేసు కొరకు రియా నియమించుకున్నారు. రోజురోజుకు అనేక మలుపు తిరుగుతున్న సుశాంత్ ఆత్మ హత్య కేసు, అసలు ఏమి జరిగి ఉటుంది అనే అనుమానాలు లేవదీస్తుంది. అందరూ ఆరోపిస్తున్నట్లుగా సుశాంత్ ని మానసిక వేదనకు గురి చేసి ఆయన చావుకు కారణం అయ్యారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.

తాజా వార్తలు