ఏప్రిల్ 4న విడుదల కానున్న ‘రౌడీ’

rowdy
తాజాగా విడుదలైన ప్రచార చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం తో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘రౌడీ’ విడుదలకు సిద్ధం అయింది. ఏప్రిల్ 4న ఈ సినిమాను విడుదల ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రాయలసీమ పరిసర ప్రాంతాలలో లో జరిగింది. ‘రౌడీ’ లో మోహన్ బాబు అతని తనయుడు మంచు విష్ణు ముందెప్పుడు చేయనటువంట్టి సరికొత్త క్యారేక్టర్లలో కనబడబోతున్నారు.

నిజ జీవితానికి దగ్గరగా ఉండే క్యారేక్టర్లను రూపొందించడంలో మంచి పేరు ఉన్న రాంగోపాల్ వర్మ ఈ సినిమాలో కూడా మోహన్ బాబు క్యారేక్టర్ ని చాల సహజంగా రూపొందించాడు. చాలా కాలం తరువాత నటి జయసుధ మోహన్ బాబు తో జతకట్టారు.

పార్థసారథి, గజేంద్ర మరియు ఎవి పిక్చర్స్ కు చెందిన విజయకుమార్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు

Exit mobile version