సంచలన సినీ నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘సైకో’ సినిమా ఈ వారం విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ కథ, స్క్రీన్ ప్లే ను అందించాడు. కిషోర్ భార్గవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. కాలిబ్రే ఫిల్మ్స్ బ్యానర్ పై వివేకానంద్ అహుజ నిర్మించిన ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ గత సినిమాలో నటించిన నిషా కొఠారి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని నిజజీవితంలో జరిగిన సంఘటనలను ఆదారంగా చేసుకొని నిర్మించారు. రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా ఈ సినిమా ప్రచారం చేస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాదించనుందా? అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచిచూడాల్సిందే.