త్వరలో వివహం చేసుకుంటున్న ఆర్.జి.వి కూతురు

Ram-GV-Revathi
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూతురు రేవతి వర్మ ఈ నెల 15న ప్రణవ్ తో పెళ్ళికి సిద్ధమవుతుంది. ఇప్పటికే నిశ్చితార్ధం పూర్తయింది. పెళ్లి కూడా చాలా లో ప్రొఫైల్ లో జరగనుంది. సమాచారం ప్రకారం సినీరంగానికి చెందిన చాలా తక్కువ మంది ప్రముఖులు ఈ వివాహానికి హాజరవనున్నారు

‘కుటుంబ వ్యతిరేకి’ అని పిలవబడే ఆర్.జి.వి మనస్తత్వానికి భిన్నంగా తనకూ, తన కూతురకూ మధ్య పరిపక్వమైన సంబంధం ఉందని పలుమార్లు తెలిపాడు. ఎస్.ఎస్ రాజమౌళి ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ “ఆర్.జి.వి తన కూతురి నిశ్చితార్ధంలో ఒక తండ్రి భాద్యతను పోషిస్తూ పనులను చేస్తుంటే చూడడానికి నయనానందకరంగావుందని” హాస్యమాడాడు.

ఏది ఏమైనా రేవతి, ప్రణవ్ దంపతులకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుందాం

Exit mobile version